యూఏఈ: కరోనా కష్టాల్లో తెలుగోడి సాయం..నిత్యావసర సరుకుల పంపిణీ
- April 27, 2020
యూఏఈ: అసలే దేశంగానీ దేశం. ఆపై కరోనా వైరస్ కష్టాలు. ఉపాధి కోసం ఎడారి దేశం వలస వచ్చిన తెలుగువారికి ప్రస్తుత సంక్షోభంలో బాసటగా నిలిచారు తిరుపతికి చెందిన ముక్కు తులసి కుమార్. యూఏఈలో ఇళ్లలో పని చేసే పలువురు తెలుగువారికి బియ్యం పంపిణి చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. పలువురు దాతలను సంప్రదించి దాదాపు నాలుగు టన్నుల బియ్యాన్ని సేకరించిన ముక్కు తులసి కుమార్..ఇప్పటికే 3 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరో వెయ్యి కిలోల బియ్యాన్ని రేపు పంచేందుకు ప్లాన్ చేసినట్లు ఆయన వివరించారు. అంతేకాదు..మరో 3 టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందించేందుకు మరో దాత సిద్ధంగా ఉన్నట్లు తులసి కుమార్ తెలిపారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో బియ్యాన్ని పంపిణి చేయడానికి సహకరించిన దాతలందరికి తులసి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాలవాళ్ళకే కాకుండా నేపాల్ , శ్రీలంకకు చెందిన పనిమనుషులకు కూడా బియ్యాన్ని పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు. తొలి రోజు పంపిణీలో ముక్కు తులసి కుమార్ తో పాటు విశ్వేశ్వరరావు, కట్టారు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?