బహ్రెయిన్: అన్ని రకాల వీసా గడువును 3 నెలలపాటు పెంపు

- April 28, 2020 , by Maagulf
బహ్రెయిన్: అన్ని రకాల వీసా గడువును 3 నెలలపాటు పెంపు

మనామా:కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలతో పాటు పలు వెసులుబాట్లు కలిపిస్తున్న బహ్రెయిన్ ప్రభుత్వం..వీసాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. విజిట్ వీసా మీద దేశానికి వచ్చిన వలసదారులు, పర్యాటకుల వీసాతో పాటు అన్ని రకాల వీసాల గడువును 3 నెలల పాటు పొడిగించింది. జూలై 23తో వీసా గడువు ముగిసినా..ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని, అలాగే ఒక్క దినార్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే కరోనా విపత్తు నేపథ్యంలో ఇప్పటికే బహ్రెయిన్ ప్రభుత్వం ప్రజలకు పలు చెల్లింపుల నుంచి మినహాయింపు ఇచ్చింది. మరో మూడు నెలల పాటు కరెంటు బిల్లు, వాటర్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అలాగే క్రెడిట్ కార్డు ఈఎంఐలను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది. 

 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com