యూ.ఏ.ఈ:అజ్మాన్ కార్మికులను ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు

- April 29, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:అజ్మాన్ కార్మికులను ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు

అజ్మాన్: అల్ జుర్ఫ్ 3 ఇన్డిస్ట్రియాల్ ఏరియాలోని  వర్కర్స్ క్యాంపు లో 12 మంది భారతీయ కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు అజ్మన్ కెఎంసిసి(కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన  ఐసోలేషన్ కేంద్రానికి గత రాత్రి వీరందరిని తరలించటం జరిగింది.

ఈ 3 అంతస్తుల భవనంలో  అన్ని వసతులతో కూడిన 84 గదులు కలవు.ఈ గదులలో గరిష్టంగా ఇద్దరు ఉండేడట్టుగా ఏర్పాట్లు చేశారు.రోగులకు కావాల్సిన నిత్యావసరాలను అజ్మాన్ కెఎంసిసి అందిస్తోంది.మెట్రో మెడికల్ సెంటర్ కి చెందిన వైద్య బృందం రోగులను పర్యవేక్షిస్తూ తగిన వైద్యం అందిస్తోంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు కెఎంసిసి చూపిన చొరవకు హర్షం వ్యక్తం చేసిన ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్.ఈ సంధర్భంగా కార్మికులు తమకు సహాయ సహకారాలు అందించిన ఇండియన్ అసోసియేషన్,అజ్మాన్ , కెఎంసిసి(అజ్మాన్) ప్రెసిడెంట్ సూపీ పాతిరపట్టకు మరియు టీం సభ్యులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com