స్వీడన్: లాక్డౌన్ లేకుండా COVID-19 ను జయించగలరా?
- April 30, 2020
స్వీడన్:భయపడుతూ బతకడం కంటే చావడం మేలనే సామెత స్వీడన్ దేశానికి సరిపోతుందేమో. అయినా వైరస్ వచ్చిందని తలుపులు మూసుకుని ఇంట్లో ఎన్ని రోజులు కూర్చుంటాం. ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు రావలసిందేగా. ఎవరి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ వహించాలి కాని ఎన్నాళ్లు లాక్‌డౌన్‌లు పెట్టి ప్రజా వ్యవహారాలను కట్టడి చేస్తాం అని స్వీడన్ ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తోంది. కరోనాని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ని మించిన ప్రత్యామ్నాయం లేదని దాదాపుగా కరోనా బాధిత దేశాలన్నీ ముక్తకంఠంతో నినదిస్తుంటే..
మీ దేశం మీ ఇష్టం.. కానీ మా దేశం మా దేశ ప్రజలు మేము చెప్పినట్టు నడుచుకుంటారు. ఆ నమ్మకం మాకుంది. ప్రజల్ని చైతన్య పరుస్తున్నాం. వైరస్ బారిన పడకుండా తమని తాము రక్షించుకోమంటున్నాం. వైరస్‌ను కట్టడి చేయాల్సి బాధ్యత ఎవరికి వారే తీసుకోవాలని చెబుతున్నాం.. అందుకే కఠిన నిర్బంధాలేవీ విధించలేదు అని చెబుతోంది. ప్రజా రవాణా నిరాటంకంగా నడుస్తోంది. యువత అధికంగా ఉండే కాలేజీలు మూత పడ్డాయి కానీ, చిన్నారులు స్కూలుకు వెళుతున్నారు. ప్రభుత్వంతో పని లేకుండా ప్రజారోగ్య సంస్థ స్వతంత్రంగా, చురుగ్గా పని చేస్తోంది. ప్రజలే స్వచ్ఛంద నిర్భంధాన్ని పాటిస్తున్నారు.
అయితే ఈ విధానం చాలా ప్రమాదకరం అనే వారూ లేకపోలేదు. పొరుగు దేశాలు కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటూ కట్టడి చేస్తున్నాయి. వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నందునే స్వీడన్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది అని అంటున్నారు. ప్రమాదకర చర్యలు అవలంభిస్తున్నారని స్వీడన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వీడన్‌లో ప్రజారోగ్యానికి సంబంధించిన విపత్తులు తలెత్తినప్పుడు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ప్రధాని, పాలక వర్గం నిర్ణయాలు నామమాత్రం అవుతాయి. ఆరోగ్య నిపుణలతో రూపొందించిన ప్రజారోగ్య సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వారి సూచనలే ప్రభుత్వం సైతం అమలు చేయాల్సి ఉంటుంది.
ఆ సంస్థకు చెందిన నిపుణుడు అండర్స్ తెగ్నల్ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. కాగా, 1.03 కోట్ల జనాభా ఉన్న స్వీడన్ దేశంలో జనవరి 31న తొలి కరోనా కేసును గుర్తించారు. ఇప్పటి వరకు అక్కడ 20,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,462 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశ ప్రజల వ్యక్తిగత ప్రవర్తనపైనే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం చూసుకోవడంతో పాటు ఇతరుల ఆరోగ్యాలకూ బాధ్యత వహించాలనేది స్వీడన్ నినాదం.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







