ఖతార్:కార్మికుల నివాస వసతులపై కొత్త ఆంక్షలు..ఐదుగురికి మించి ఉండొద్దని ఆదేశాలు

- April 30, 2020 , by Maagulf
ఖతార్:కార్మికుల నివాస వసతులపై కొత్త ఆంక్షలు..ఐదుగురికి మించి ఉండొద్దని ఆదేశాలు

దోహా:కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కార్మికుల నివాస వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక నుంచి కుటుంబాలు నివాస ప్రాంతాల్లో కార్మికుల కోసం కేటాయించిన గదుల్లో ఐదుగురికి మించి ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తరహాలో ఒకే గదిలో ఊపిరి సలపలేనంత మంది కార్మికులు ఉండే అవకాశం లేదు. ప్రతి ఐదుగురికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లైతే భవన సొంతదారుతో పాటు కిరాయిదారుడిపై చట్టపపరమైన చర్యలు ఉంటాయి. ఐదుగురికి మించి ఎక్కువగా ఉంటే బిల్డింగ్ ఖాళీ చేయాల్సిందిగా తొలుత హెచ్చరిస్తారు. మాట వినకుంటే ఆ బిల్డింగ్ కు నీటి సరఫరాతో పాటు కరెంట్ సరఫరాను కూడా నిలిపివేస్తామని మున్సిపాలిటి, పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు హెచ్చరించారు. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష, QR 50,000 నుంచి QR 100,000 వరకు జరిమానా విధిస్తారు. లేదంటే జరిమానాగానీ, జైలు శిక్షగానీ విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే..మహిళా కార్మికులకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే వంట మనుషులు, డ్రైవర్ల వంటి గృహ కార్మికులకు మాత్రం కొద్దిమేర మినహాయింపులను ఇచ్చారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com