అవలంబిక మూవీ మోషన్ పోస్టర్ లాంచ్...
- May 01, 2020
శ్రీ షిరిడీ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై సుజయ్ , అర్చన హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రాజ్ దర్శకుడిగా జి.శ్రీనివాసగౌడ్ నిర్మిస్తున్న సోసియో పాoటసీ చిత్రం "అవలంబిక" ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈసందర్భంగా దర్శకుడు రాజశేఖర్ రాజ్ మాట్లాడుతూ... కొన్ని శతాబ్దాల క్రితం ఒక రాజ్యంలో జరిగిన కథను లీడ్ తీసుకొని ఇప్పడు జరుగుతున్న స్టోరీకి లింక్ చేసి భారీ గ్రాఫిక్స్ తో చాలా కష్టపడి చేశాము ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలో సెన్సార్ కంప్లీట్ చేసుకొని విడుదల చేయాలని అనుకునున్నాము అన్నారు. నిర్మాత జి.శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ... డైరెక్టర్ ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించిన విధానము సూపర్ , మా బేనర్ లో తీసిన ఈ సినిమా ద్వార మాకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ చిత్రంలో మంజుషా,కృతిక,కృష్ణ చైతన్య, లావణ్య,నాగేంద్ర,యై వి రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయకిరణ్ యూ కె , కెమెరా: వెంకీ , కిట్టు, ఎడిటింగ్: శ్రీచందు, డాన్స్: రూప్ కుమార్,రవి నాయక్, ఫైట్స్: యై రవి,నిర్మాత: జి.శ్రీనివాసగౌడ్ , దర్శకత్వం: రాజశేఖర్ రాజ్ .
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







