ఖతార్ : కాలం చెల్లిన ఆహారపదార్ధాలను అమ్ముతున్న ముఠా అరెస్ట్
- May 01, 2020
గడువు ముగిసిన తినుబండారాలను రీప్యాక్ చేసి అక్రమంగా మార్కెట్ కు సరఫరా చేస్తున్న ముఠాను ఖతార్ పోలీసులు అరెస్ట చేశారు. వాక్రాలోని ఓ ఇంటిని కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్దాల పొట్లాలను మళ్లీ ప్యాక్ చేసి మార్కెట్ కు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాక్రా ప్రాంతంలో రైడ్ చేశారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఫుడ్ స్టఫ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







