కరోనాపై పోరులో సహకరించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపిన కువైట్ రాయబారి
- May 02, 2020
కువైట్:కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొవటంలో కువైట్ కు చేదోడుగా నిలిచిన భారత ప్రభుత్వానికి కువైట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని కువైట్ రాయబారి హెచ్ఈ జెస్సెమ్ అల్ నజెం ఓ ప్రకటన విడుదల చేశారు. కువైట్ కు 15 మందితో కూడిన మెడికల్ టీంను పంపటంతో పాటు రెండు టన్నుల మెడికల్ పరికరాలను పంపి భారత్ తన ఉదారతను చాటుకుందని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కువైట్ చేస్తున్న పోరాటానికి పలు రకాలుగా సాహాయ పడుతున్న మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇంకా భారత్ తన సాయం కొనసాగిస్తోందని, పారాసిటమాల్ మాత్రలతో పాటు ఆహారపదార్దాలను కువైట్ కు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారత్ చిక్కుకుపోయిన కువైట్ పౌరులను స్వదేశానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే కువైట్ అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారని, క్షమాభిక్ష పథకం కింద ఒక్క పైసా ఖర్చు లేకుండా వారిని వారి సొంత దేశాలకు తరలిస్తున్నామని అన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







