గలేరియా అల్ మర్యాహ్ ఐలాండ్ షాపింగ్ మాల్ పునఃప్రారంభం
- May 02, 2020
అబుధాబి:మే 2 నుంచి గలేరియా అల్ మర్యాహ్ ఐలాండ్ సెంటర్ పునఃప్రారంభమయ్యింది. అబుధాబి గ్లోబల్ మార్కెట్ మరియు అబుధాబి ఎకనమిక్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ అనంతరం ఈ సెంటర్ ప్రారంభానికి అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. కేవలం 30 శాతం మంది కస్టమర్ కెపాసిటీతో గలేరియా అందుబాటులోకి వచ్చింది. పార్కింగ్ స్పేస్‌ని తగ్గించడం, ఫుడ్ ఔట్‌లెట్స్‌ని రివైజ్ చేయడం వంటివి పూర్తి చేశాక అనుమతులు మంజూరు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎంప్లాయీస్ మరియు షాపర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకున్నారు. రమదాన్ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాల్ తెరిచి వుంటుంది. సూపర్ మార్కెట్స్ మరియు ఫార్మసీస్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి వుంటాయి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







