కరోనా వైరస్ మరో రెండేళ్లు మనతోనే..
- May 02, 2020
అమెరికా:నెలా, రెండు నెలలు లాక్‌డౌన్ విధించి కరోనా బారిన పడకుండా తప్పించుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ 2022 లేదా ఆ తరువాత కూడా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మేరకు పరిశోధనలు సాగించిన మిన్నెసొటా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ (సీఐడీఆర్‌ఏపీ) నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండువంతుల మంది వైరస్‌ను తట్టుకునే శక్తి సంతరించుకునే వరకు ఈ ముప్పును నియంత్రించలేమన్నారు. వైరస్ సోకినా ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడమే ఇందుకు కారణం అని అన్నారు. కొందరికి లోపల ఇన్ఫెక్షన్ ముదిరిపోతున్నా ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించట్లేదన్నారు. అందువల్లే ఈ వైరస్‌ను ఇప్పట్లో కట్టడి చేయడం అసాధ్యమన్నారు. కరోనా విపత్తు ఇప్పటితో ముగియదని, ఇంతకంటే భారీ ఇన్ఫెక్షను మున్నుందు ఎదురవనున్నాయని, వాటిని ఎదుర్కునేందుకు సన్నద్ధం కావాలని సూచించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







