స్మాల్‌ బిజినెస్‌లకు 2.39 బిలియన్‌ డాలర్లను కేటాయించిన సౌదీ సోషల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌

- May 02, 2020 , by Maagulf
స్మాల్‌ బిజినెస్‌లకు 2.39 బిలియన్‌ డాలర్లను కేటాయించిన సౌదీ సోషల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌

సౌదీ అరేబియా: సోషల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎస్‌డిబి), సౌదీ అరేబియాలో చిన్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా 2.39 బిలియన్‌ డాలర్లను కేటాయించింది. సెల్ఫ్ ఎంప్లాయ్డ్‌ ఎంటర్‌ప్రెన్యూసర్స్‌కి కూడా ఇది వర్తిస్తుంది. లోకల్‌ ఆర్ధిక వ్యవస్థకి  మద్దతుగా ఈ చర్యలు చేపట్టారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటోన్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 6,000 వ్యాపారాలకు ఇది ఉపకరిస్తుందని బ్యాంకు  పేర్కొంది. గత నెలలో ప్రారంభమైన గ్రేస్‌ పీరియడ్‌ ఆరు నెలల వరకు కొనసాగుతుంది. కాగా, ఎస్‌డిబి గతంలో 100,000 తక్కువ ఆదాయం గల కుటుంబాలకు సాయం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com