'మాట'
- May 22, 2015
రెండు అక్షరాల పదానికి ఎనలేని అర్ధం ఉంది. ఇది పూవుకన్నా మెత్తనైనది.వజ్రం కన్నా గట్టిది.తలచుకుంటే ప్రళయ వాతావరణాన్ని సృష్టించగలదు మరియు సామరస్య సంకేతాలనూ దీని ద్వారా పంపవచ్చు.భావ వ్యక్తీకరణకు పట్టుకొమ్మ అయిన మాట పైనే ప్రపంచమంతా ముందుకు సాగుతోంది.ఒక దేశాధ్యక్షుడు మితిమీరి మాటలు జారితే అది చివరకు పపంచ యుద్ధం దాకా దారితీయవచ్చు.మానవ సంబంధాలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా అత్యంత భూమిక నిర్వహిస్తుంది.కాబట్టి మాట్లాడే ముందు తగు జాగ్రత్త వహించడం చాలా అవసరం.ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆచీతూచీ వ్యవహరించాలి.మంచి మాటలనే విత్తనాలను వీరి మెదళ్ళలో నాటి, పోషించగలిగితే, వీరి భవిష్యత్తు వృజ్వలంగా మారి మహావృక్షమై పదిమందికీ ఫలాలను అందించ గలుగుతుంది. విషభీజాలను నాటితే తీవ్రవాదిగా తయారవుతారు.కనుక, మానవులకు మాత్రమే ఉన్న "విచక్షణా జ్ఞానాన్ని" వినియోగించి మాట్లాడాలి.మాట అద్దంలాంటిది.అది పగిలితే అతుక్కోవడం అంత సులభంగాదు.
మాట ద్వారానే వ్యక్తిత్వ వికాసం తెలుసుకోగలుగుతాం.వ్యక్తిత్వ వికాసానికి తనచుట్టూ ఉండే పరిసరాలు ముఖ్యంగా కుటుంబ వ్యవస్థయే పునాది.ఈ కుటుంబ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది, వ్యవహారశైలి.ఈ వ్యవహారశైలిక మాధ్యమమే "మాట".పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపే మన పెద్దల వ్యవహారశైలి అనే వృక్షానికి మంచిమాటలనే నీళ్ళుపోసి, పెంచి, పోషించి, ఆ నీడలో మన పిల్లలు పెరగాలని మరియు వారి మనుగడకు మనం మార్గదర్శకంగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
--- యస్.పి. సోమ సుందర్, దుబాయ్.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







