మోసగాళ్లకు మోసగాడు : రివ్యూ
- May 22, 2015
మనకు ఇప్పటి వరకూ విగ్రహాల చోరీల మీద పలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి.. అలాంటి మరో సినిమాకి సుధీర్ బాబు సైన్ చేసాడు.. ఒక హీరోయిన్ ఉంది.. ఇన్వెస్టిగేషన్ కోసం ఓ టఫ్ లుకింగ్ యాక్టర్ ని ఎంచుకున్నారు.. డాన్ పాత్రలని సృష్టించారు.. మధ్య మధ్యలో కమెడియన్స్ తో కామెడీ చెయ్యడానికి ట్రై చేసారు... క్రైమ్ కామెడీ సినిమాలో ఇవి ఉంటాయి.. ఇందులోనూ అవే ఉన్నాయి. తను కొత్తగా చెప్పాలనుకున్న పాయింట్ ఏమీ లేదు.. హీరో వేరే ఏమన్నా చేస్తాడా అంటే లేదు ఎప్పటిలానే తనొక దొంగ. ఈ సినిమా కథ నుకున్నప్పుడు ఇది స్వామీ రారా సినిమాకి సీక్వెల్ కానీ సినిమా పూర్తయ్యాక మోసగాళ్ళకు మోసగాడు సీక్వెల్ లా అనిపించదు. సీక్వెల్ అంటే ఒరిజినల్ సినిమా థీమ్ లైన్ తో ఇంకాస్త ఆసక్తికరంగా, ఇంకాస్త హై లెవల్ లో ఉండాలి. కానీ ఈ సినిమాకి కెప్టెన్ గా వ్యవహరించిన డైరెక్టర్ నెల్లూరి బోసు సినిమాని అంత ఆసక్తికరంగా నడిపిన్చాలేకపోవాడు.. స్టార్టింగ్ బాగా చేసి వెంటనే సినిమాని బాగా డల్ చేసేసి.. మళ్ళీ క్లైమాక్స్ దగ్గర సినిమాని నడిపించాడు.. ఓవరాల్ గా మెప్పించదగిన అటెంప్ట్ ని బోస్ చెయ్యలేదు. ముఖ్యంగా ఒరిజినల్ వెర్షన్ లోని ఒక్క సీన్ కూడా మ్యాచ్ అయ్యేలా ఈ సినిమా లేకపోవడం బాధాకరం.
మాగల్ఫ్.కాం రేటింగ్: 2.75/5
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







