కోవిడ్-19 ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనంలో మార్పులు

- May 03, 2020 , by Maagulf
కోవిడ్-19 ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనంలో మార్పులు

తిరుమల:ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం అంత సులువు కాదు. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయేవరకు స్వామి వారిని దర్శించే భక్తుల సంఖ్యపై పరిమితి విధించే అవకాశం ఉంది. వైరస్ కట్టడి చర్యలో భాగంగా భక్తుల సంఖ్యను పరిమితం చేయనుంది. ఇంతకు ముందు రోజుకు 60 వేల నుండి 80వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించే వారు. లాక్డౌన్ అనంతరం రోజు వారి భక్తుల సంఖ్యలో నాలుగో వంతు మంది మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. అదీ ఆన్‌లైన్, టైమ్ స్లాటెడ్ భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతించే సర్వ దర్శనాన్ని కొంత కాలం పాటు నిలిపివేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com