దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న ఇండియన్‌

- May 07, 2020 , by Maagulf
దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న ఇండియన్‌

దుబాయ్:తాజా దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ మరియు ఫైనెస్ట్‌ సర్‌ప్రైజ్‌ డ్రా మే 6న జరిగింది. ఈ డ్రాలో ముగ్గురు భారతీయ వలసదారులు విజేతలుగా నిలిచారు. 47 ఏళ్ళ అజిత్‌ నరేంద్రన్‌, 1 మిలియన్‌ డాలర్స్‌ విజేతగా నిలిచారు. అబుదాబీలో ప్రస్తుతం నివాసముంటున్నారు అజిత్‌ నరేంద్రన్‌. అబుదాబీలోని మారియట్‌ హోటల్‌లో పర్చేజింగ్‌ మేనేజర్‌గా నరేంద్రన్‌ పనిచేస్తున్నారు. కేరళకు చెందిన నరేంద్రన్‌, 3 ఏళ్ళుగా అబుదాబీలో నివసిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఆయన దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతం చాలా ప్రత్యేకంగా వుందనీ, ఈ గెలుపుని తాను నమ్మలేకపోతున్నానని అన్నారాయన. మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ మోటర్‌ బైక్‌లు బహుమతిగా వరించాయి. ఓ వీజేత అబ్దుల్‌ జలీల్‌, స్వదేశానికి వెళ్ళారు. ఆయన కేరళకు చెందినవారు. రాజేష్‌ బాలన్‌ అనే మరో భారతీయుడు మోటో గుజ్జి ఆడాస్‌ గెల్చుకున్నారు. దుబాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్క్‌లో లాజిస్టిక్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com