షార్జా అగ్నిప్రమాదం రిపోర్ట్:నిషేధిత అల్యూమినియం పూత కారణం
- May 07, 2020
షార్జా:షార్జాలో 49 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాద తీవ్రత పెరగటానికి నిషేధిత అల్యూమినియం పూత కారణమని అధికారులు నిర్ధారించారు. బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగానే క్షణాల్లో మంటలు విస్తరించాయని...భవనం ముందు భాగంగాలో అల్యూమినియం పూత ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని వివరించారు. ఈ మేరకు ఫోరెన్సిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ సర్కల్ తన ప్రాధామిక విచారణ వివరాలను వెల్లడించారు. అయితే..అగ్నిప్రమాద ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోందని అన్నారాయన. గతంలో కూడా అల్యూమినియం పూత కారణంగా చాలా భవనాలు అగ్నిప్రమాదాల బారిన పడ్డాయని, 2015, 2016, 2017 లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయని బ్రిగేడియర్ అహ్మద్ వివరించారు. వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో 2017లోనే భవనం ముఖభాగంలో అల్యూమినియం తాపడం వాడటాన్ని షార్జా మున్సిపాలిటి నిషేధించిందన్నారు. అయితే..ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గురైన అబ్కొ టవర్ నిషేధం అమలులోకి రాక ముందు నిర్మించారని, అయినా..అల్యూమినయం తాపడటాన్ని తొలగించాల్సిందిగా ఇది వరకు భవన యజమానికి ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే..తాజా ఘటనతో షార్జా మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాత భవనాలకు కూడా అల్యూమినియం పూతను తొలగించాలని ఆయా భవనాల యాజమాన్యాలకు సూచించాయి. షార్జాలో అల్యూమినియం పూత ఉన్న భవనాల వివరాలను సేకరించేందుకు సమగ్ర సర్వే నిర్వహిస్తామని షార్జా మున్సిపాలిటి ప్రకటించింది. అగ్నిప్రమాదాలకు దోహదం చేసే అల్యూమినియం పూతను తొలగించేందుకు నిర్ణీత గడువు ఇస్తామరి, ఆలోగా తాపడాన్ని మార్చాల్సిందేనని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన