ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ముస్తఫా ఖాద్మీ
- May 07, 2020
ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ముస్తఫా ఖాద్మీని గురువారం పార్లమెంటు ఎన్నుకుంది. అమెరికా దేశ మద్ధతుదారు అయిన ముస్తఫా ఖాద్మీ గతంలో ఇరాక్ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఇరాక్ దేశ భద్రత, స్థిరత్వం, వికాసానికి తాను పనిచేస్తానని ఇరాక్ కొత్త ప్రధాని ముస్తఫా ఖాద్మీ ట్వీట్ చేశారు. ఇరాక్ దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ పై పోరాటానికి తాను ప్రాధాన్యమిస్తామని ముస్తఫా ప్రకటించారు.
గతంలో వేలాది మంది ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఇరాక్ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో నవంబరులో అదెల్ అబ్దుల్ మహ్దీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







