కువైట్:త్వరలోనే ఆన్ లైన్ లో తాత్కాలిక రెసిడెన్సీ బదిలీ...
- May 07, 2020
కువైట్:ఆర్డికల్ 17 మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు నివాస అనుమతి రెన్యూవల్, అలాగే తాత్కాలిక నివాస అనుమతిని శాశ్వత నివాస అనుమతిగా బదిలీ చేసే సేవలు ఇక ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి వచ్చే వారంలో ఆన్ లైన్ సేవలను ప్రారంభించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టికల్ 18, ఆర్టికల్ 22 మేరకు ఇప్పటికే ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంలో కువైట్ లోని ప్రతి నివాస సెక్టార్ లో దాదాపు 450 వేలకుపైగా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఆన్ లైన్ సేవలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఆర్టికల్ 18 మేరకు 70 వేల మందికి, ఆర్టికల్ 22 మేరకు 43 వేల మందికి ఆన్ లైన్ లో రెసిడెన్సీ రెన్యూవల్స్ చేసినట్లు అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు