ఔరంగాబాద్: రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన
- May 08, 2020
మహారాష్ట్ర:ఔరంగాబాద్‌లోని రైలు ప్రమాద ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. కర్మాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. బడ్నాపూర్, కర్మద్ రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదం జరిగిందని వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వివరించింది.
ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలను గమనించిన లోకో పైలట్ రైలును ఆపేందుకు ప్రయత్నించాడని.. అయితే ఆ ప్రయత్నం విఫలం అయిందని రైల్వే శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పర్బాని-మన్మాడ్ సెక్షన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. క్షతగాత్రులను ఔరంగాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..