కార్మికులకు కోవిడ్‌ లక్షణాలుంటే ఉపేక్షించొద్దు

- May 08, 2020 , by Maagulf
కార్మికులకు కోవిడ్‌ లక్షణాలుంటే ఉపేక్షించొద్దు

మస్కట్‌: మినిస్ట్రీ టాఫ్‌ మేన్‌ పవర్‌, ప్రైవేట్‌ సెక్టార్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఉద్దేశించి ఓ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో, కరోనా లక్షణాలు కార్మికులెవరికైనా వుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా లక్షణాలు ఏ వర్కర్‌లో అయినా కన్పిస్తే, వెంటనే అతన్ని మిగతా కార్మికుల నుంచి దూరంగా వుంచాలనీ, సంబంధిత అధికార వర్గాలకు సమాచారం ఇవ్వాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com