ఐదుగురికంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం
- May 08, 2020
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కరోనా వైరస్‌కి సంబంధించి కొత్త రెగ్యులేషన్స్‌ని ప్రకటించింది. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడటాన్ని నిషేధిస్తూ ఓ రెగ్యులేషన్ని పొందుపర్చింది తాజాగా. రెగ్యులేషన్స్‌ని ఉల్లంఘిస్తే 5,000 సౌదీ రియాల్స్ నుంచి 100,000 సౌదీ రియాల్స్ వరకూ జరీమానాలు విధిస్తారు. కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు ఇలా గుమి కూడితే చర్యలు తీసుకుంటారు. ఇల్లీగల్ గేదరింగ్కి పాల్పడినవారికి 5,000 సౌదీ రియాల్స్ జరీమానా. ఉల్లంఘన తాలూకు తీవ్రతను బట్టి ఈ జరీమానా పెరుగుతూ వుంటుంది. ఉల్లంఘనలకు పదే పదే పాల్పడుతోంటే మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇల్లీగల్ గేదరింగ్కి ఆస్కారమిచ్చే ప్రైవేట్ సెక్టార్ ఫెసిలిటీస్‌పై మూడు నెలల మూసివేత విధిస్తారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు ఈ గేదరింగ్స్‌పై తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,731కి చేరుకుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం