షార్జా:అబ్కో టవర్ బాధితులకు నివాసం కల్పించాలన్న రూలర్
- May 09, 2020
షార్జా:షార్జాలో అగ్నిప్రమాదానికి గురైన అబ్కో టవర్ బాధితులకు తగిన సాయం చేయాలని షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖసిమి అన్నారు. టవర్ లో ఉండే వాళ్లందరికీ తగిన నివాస సౌకర్యం కల్పించాలని షార్జా చారిటీ అసోసియేషన్ ను ఆయన ఆదేశించారు. టవర్ లో మరమ్మత్తులు పూర్తై మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఖచ్చితంగా ఆవాసం కల్పించాల్సిందేనని అన్నారు. ఇదిలాఉంటే..షార్జా అగ్నిప్రమాద ఘటనను కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు వాడుకునే కుట్రలు చేస్తున్నట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. బాధితులకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని హెచ్చరించారు. అగ్నిప్రమాదం బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సాయం అందుతోందని, వారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకొని సాయం చేసేందుకు అధికారిక కమిటి కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. ఒకవేళ ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే షార్జా చారిటీ అసోసియేషన్ ద్వారాగానీ, ఎమిరాతి రెడ్ క్రిసెంట్ ద్వారా సాయం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?