వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

- May 09, 2020 , by Maagulf
వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, వాట్సాప్‌ సర్వీస్‌ ఫస్ట్‌ స్టేజ్‌ - కాంటాక్ట్‌ సెంటర్‌ 937ని ప్రారంభించింది. చాట్‌ పాట్‌ (ఇంటరాక్టివ్‌ చాట్‌) 920005937 నెంబర్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. కరోనా వైరస్‌కి సంబంధించిన సమాచారం, ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్స్‌ వివరాలు, అపాయింట్‌మెంట్‌ సర్వీస్‌, బ్లడ్‌ డొనేషన్‌ మరియు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సెంటర్‌ కాంటాక్ట్‌ వంటివి ప్రాథమికంగా ఇందులో అందుబాటులో వుండే సర్వీసులు. 1,000కి పైగా ఉద్యోగులు, కస్టమర్‌ సర్వీస్‌ స్పెషలిస్ట్‌లు మరియు డాక్టర్లు ఈ సెంటర్‌లో టెలిఫోన్‌, సోషల్‌ మీడియా, ఇ-మెయిల్‌, ఇన్‌స్టంట్‌ ఛాట్‌ వంటి విభాగాల్లో పనిచేస్తుంటారు. ఈ సెంటర్‌ 24 గంటలూ పనిచేస్తుంది. యూనిఫైడ్‌ నెంబర్‌ 937, ట్విట్టర్‌ హ్యాండిల్‌, ఇ-మెయిల్‌ మరియు ఇన్‌స్టంట్‌ ఛాట్‌ వంటివి అందుబాటులో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com