తెలంగాణ:పేద కార్మికులకు ఉచిత క్వారంటైన్
- May 09, 2020
హైదరాబాద్:కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను చేపట్టింది.ఇందులో భాగంగా తొలి విమానం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ నేటి రాత్రి (09.05.2020) కువైట్ నుంచి హైదరాబాద్ రానుంది.
14 రోజుల క్వారన్ టైన్ కోసం ప్రభుత్వం హోటళ్లలో ప్రత్యేక ఏర్పాటు చేసింది. రూ. 15 వేలు, రూ.30 వేల ప్యాకేజీలు ప్రకటించారు. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పేద కార్మికులను ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వ యంత్రాంగమునకు , ఇందుకోసం కృషి చేసి చేసిన వేములవాడ ఎమ్మెల్యే డా.చెన్నమనేని రమేష్ బాబు కు గల్ఫ్ వలస కార్మికుల పక్షాన గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిళ్ల రవి గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు.
గల్ఫ్ కార్మికుల ఘర్ వాపసీ విమాన చార్జీలను కేంద్ర ప్రభుత్వం, క్వారంటైన్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరుతూ గల్ఫ్ జెఏసి పిలుపుమేరకు శుక్రవారం నాడు గల్ఫ్ దేశాలలోని కార్మికులు.ఇండియాలోని వారి కుటుంబ సభ్యులు 'గల్ఫ్ భరోసా దీక్ష' చేశారు. కార్మికుల కోరికను పట్టించుకున్న తెలంగాణ ప్రభుత్వం పేద కార్మికులకు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విమాన చార్జీలు లేకుండా గల్ఫ్ కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
కువైట్ నుండి హైదరాబాద్ కు చేరనున్న కొందరు కార్మికుల వివరాలు:
నిజామాబాద్ జిల్లా
1. శ్రీకాంత్, వెంకటాపూర్
2. సురేష్, హాసకొత్తూర్
3. రమేష్, హాసకొత్తూర్
4. శ్రీధర్, కోనసముందర్
5. బర్కుంట సురేష్, పురంపేట్
6. మారుతి, మెండోరా
7. నాగరాజ్, మెండోరా
జగిత్యాల జిల్లా
8. అబ్బ రాకేష్, ఇబ్రహీంపట్నం
9. మోహన్, వేములకుర్తి
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!