అబుధాబి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు మొబైల్ స్క్రీనింగ్ ప్రారంభించిన పోలీసులు
- May 10, 2020
అబుధాబి:కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాధి నిర్ధారణ పరీక్షలను అబుధాబి పోలీసులు ప్రారంభించారు. ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఈ మొబైల్ స్క్రీనింగ్ సర్వీసును అందిస్తున్నారు. మొబైల్ స్క్రీనింగ్ వాహనం ద్వారా వైద్య బృందం ఇళ్ల వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా కట్టడి కోసం యూఏఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా మొబైల్ స్క్రీనింగ్ ప్రారంభించినట్లు అబుధాబి పోలీసు విభాగంలోని ఆర్ధిక సేవల విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలిఫా మొహమ్మద్ అల్ ఖైలి వెల్లడించారు. ప్రాణాంతక మహమ్మారి నుంచి తమ ప్రజలను రక్షించుకోవటమే లక్ష్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన విధానం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలాఉంటే మొబైల్ వైద్య పరీక్షల వాహనంలో రెండు క్లీనిక్ లతో పాటు...జాయింట్ అడ్మినిస్ట్రేటీవ్ విభాగం, వైద్య బృందం ఉన్నట్లు వైద్య సేవల విభాగం లెఫ్టినెంట్ కల్నల్ తుర్య అల్ హషేమి అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?