రియాద్:పార్ట్ టైం వర్క్ కు కొత్త షరతులు..నెలలో 95 గంటల వరకు అనుమతి
- May 10, 2020
రియాద్:సౌదీ అరేబియాలో పార్ట్ టైం వర్క్ కు సంబంధించి కొత్త షరతులను మానవ వనరులు, సాంఘిక అభివృద్ధి ఆమోదించింది. పార్ట్ టైం వర్క్ పనిగంటలను నెలలో 95 గంటలుగా నిర్ధారించింది. వచ్చే జులై నుంచి ఈ కొత్త షరతులు అమల్లోకి వస్తుందని సౌదీ గెజిట్ లో పేర్కొంది. అయితే..దీని నుంచి సౌదీ పౌరులకు మాత్రమే ప్రయోజనం దక్కనుంది. సాధారణ పని గంటల్లో సగానికి మించకుండా పార్ట్ టైం పని వేళలు ఉండాలని పేర్కొంది. అయితే..సౌదీ యాజమాన్య సంస్థల్లో నితాఖాత్ లో పేర్కొన్న సౌదీజషన్ శాతానికి అనుగుణంగా పార్ట్ టైం వర్క్ ఉద్యోగుల ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే..గంటలవారీ పని కేటాయింపు ఉంటుంది కనుక అందుకు వేతనం గంటల వారీగా కానీ, నెలవారీగా ఇవ్వొచ్చు. ఇది యాజమాన్యం, ఉద్యోగి పరస్పర అంగీకారం మేరకు ఉంటుంది.
అంతేకాదు పార్ట్ టైం ఉద్యోగాన్ని అభ్యర్ధించేవారు ఖచ్చితంగా సామాజిక బీమా సంస్థలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకొని ఉండాలి. ఇక నెలలో 95 గంటల చొప్పున మొత్తం 168 గంటలైనా ఖచ్చితంగా ఒక కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ప్రొహిబిషన్ సమయంలో ఉద్యోగి తప్పకుండా విధులకు హజరుకావాలి. అయితే..ఫ్లెక్సిబుల్ వర్క్ లేదా పార్ట్ టైం వర్క్ ఒప్పందం చేసుకున్నవారు జీతంతో కూడిన సెలవుల కోసం ఒత్తిడి చేసేందుకు ఆస్కారం లేదు. వార్షిక సెలవులు, సిక్ లీవులు, అకేషషన్ సెలవులు వారికి వర్తించవని కూడా మానవవనరుల మంత్రిత్వ శాఖ కొత్త షరతులతో కూడా గెజిట్ లో స్పష్టం చేసింది. అటు ఉద్యోగులకు కూడా కొన్ని వెసులుబాటు కల్పించింది. ఒక వేళ నిర్ణీత సమయంలో కాకుండా తమకు ఇష్టమైన సమయంలో పనికి రావాల్సిందిగా పార్ట్ ఉద్యోగులను ఆదేశించేందుకు యాజమాన్యాలకు ఆస్కారం లేదు. ఒకవేళ అలా ఆదేశించిన పక్షంలో సదరు ఉద్యోగి ఆమోదించనూ వచ్చు లేదా తిరస్కరించనూ వచ్చు.యాజమాన్య ఆదేశాలను తిరస్కరించినా సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు వీలు ఉండదు. ఒకవేళ ఒప్పందానికి సంబంధించి ఎవైనా వివాదాలు ఉంటే లేబర్ కోర్టును ఆశ్రయించవచ్చని కూడా మానవ వనరుసల శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?