విదేశీ వైద్యులకు అమెరికా శుభవార్త‌...

- May 10, 2020 , by Maagulf
విదేశీ వైద్యులకు అమెరికా శుభవార్త‌...

అమెరికా:కరోనాతో గడ్డుకాలం ఎదుర్కుంటున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావాన్ని ఎదుర్కునేందుకు ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించని.. దాదాపు 40వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో కాంగ్రెస్‌ ఆమోదించినప్పటికీ జారీ కాని గ్రీన్‌ కార్డులను ఇప్పుడు మంజూరు చేయానున్నట్టు తెలిపింది బిల్లు. ఇప్పటివరకూ అమెరికాలో 12లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, మృతుల సంఖ్య 77 వేలు దాటింది. దీంతో చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ది హెల్త్‌కేర్‌ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ యాక్ట్‌ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్‌కార్డులకు అనుమతి ఇచ్చే అధికారం అక్కడి కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందవచ్చు.

మరోవైపు కరోనా మహామ్మారి విజృంభిస్తున్న తరుణంలో హెచ్‌1బీ వీసాల జారీపై కీలక నిర్ణంయం తీసుకోవడాకిని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది...అమెరికాలో రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుండటం,వారికి ఉద్యోగ భృతి చెల్లించడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని హెచ్‌1బీ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలిని యూఎస్‌ సర్కార్‌ పావులు కదుపుతుంది.

ఇప్పటికే హెచ్‌1బీ సహా పలు రకాల వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్‌ ఆథరైజేషన్‌తో కూడిన స్టుడెంట్‌ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్‌ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్‌ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్‌1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్‌ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com