షార్జా:సిగరేట్ పీక ముక్కల వల్లే 49 అంతస్తుల అబ్కో టవర్ లో అగ్ని ప్రమాదం
- May 10, 2020
షార్జా:షార్జాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 49 అంతస్తుల అబ్కో టవర్ లో అగ్నిప్రమాదానికి కారణం ఓ వ్యక్తి సిగరేట్ పీక ముక్కను పడేయటమే అని విచారణ అధికారులు నిర్ధారించారు. ఫస్ట్ ఫ్లోర్ లోని కర్టెన్లపై తాగి పడేసిన సిగరేట్ ను విసిరివేయటం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుందని దర్యాప్తులో తేల్చిచెప్పారు. పై అంతస్తులో నుంచిగానీ, పక్క భవనం నుంచి గానీ సిగరేట్ ను నిర్లక్ష్యంగా విసిరి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సిగరేట్ పీక ముక్క కర్టెన్లపై పడటంతో..కర్టెన్లు అంటుకున్నాయని...చూస్తుండగానే మంటలు భవనం మొత్తం విస్తరించాయని అధికారులు చెబుతున్నారు. నిషేధిత అల్యూమినియం తాపడం ప్రమాద తీవ్రతను మరింత పెంచిందన్నారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యంతో ఇంతటి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ఫోరెన్సిక్ ల్యాబరేటరీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ సెర్కల్ అన్నారు. ఈ ప్రమాదంలో నివాసం కొల్పోయిన వారిని సమీప హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు. అలాగే ఈ ప్రమాదంలో 33 కార్లు పూర్తిగా దగ్థం అయ్యాయి. ఇదిలాఉంటే తాగిపడేసిన సిగరేట్ పీక ముక్కల కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవటం షార్జాలో ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న అబ్కో టవర్స్ లో 333 యూనిట్స్ ఉంటే అందులో 203 యూనిట్స్ అగ్నిప్రమాదానికి గురి కాలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?