కోవిడ్-19:మస్కట్ లో 5 వేల ఫుడ్ బాస్కెట్ పంపిణీ
- May 10, 2020
మస్కట్:కరోనా వైరస్ సంక్షోభంతో ఉపాధి కొల్పోయిన బాధితులకు బాసటగా నిలిచారు సీబ్ పరిధిలోని అధికారులు. సీబ్ పరిధిలో ఉపాధి కొల్పోయిన బాధితులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. సీబ్ గవర్నర్, సామాజిక అభివృద్ధి కమిటీ గత మూడు వారాలుగా దాదాపు 5,160 ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉపాధి కొల్పోయిన బాధితులకు తాము ఎల్లవేళలా సాయం చేస్తామని సీబ్ ప్రాంతంలోని షుర మండలి ప్రతినిధి హిలాల్ బిన్ హమద్ అల్ సర్మి తెలిపారు. సీబ్ ప్రాంతంలో దాదాపు 73 వేల మందికి OMR 35,000 ఆర్ధిక సాయం చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 16 వందల మందికి ఇఫ్తార్ మీల్స్ ను పంపిణీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?