కువైట్ కర్ఫ్యూ: మెడికల్ పర్మిట్లు తప్పనిసరి
- May 10, 2020
కువైట్: కరోనా ను అరికట్టేందుకు కువైట్ అంతటా కర్ఫ్యూ విధించిన సంగతి విదితమే. మరి ఈ కర్ఫ్యూ సమయంలో వైద్య సహాయమా కొరకు బయటకి వెళ్లాలనుకునేవారు తప్పకుండా పర్మిట్ తీసుకోవాలని ప్రకటించిన ప్రభుత్వం.
పర్మిట్ కొరకు అధికారిక వెబ్ సైట్ https://curfew.paci.gov.kwలో నమోదు చేయడం ద్వారా నిషేధ కాలంలో వైద్య అనుమతులు పొందవచ్చు. వెబ్ సైట్ లో ప్రజలు ఆస్పత్రి లేదా ఆరోగ్య కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తరువాత, సదరు వ్యక్తి తానూ నమోదు చేసుకున్న పర్మిట్ ను ఆసుపత్రి యాజమాన్యానికి చూపించాలి. దానిని పరిశీలించినతదుపరి ఆసుపత్రి యాజమాన్యం వ్యక్తి కి కావలసిన వైద్య సహాయం అందిస్తుంది అని అధికారులు ఈ రోజు ఒక పత్రికా ప్రకటన తెలిపారు.
పర్మిట్ తీసుకోకుండా బయటకు వెళ్లిన వ్యక్తి చట్టబద్దమైన జవాబుదారీతనంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి అనుమతి పొందకుండా నిరోధించబడతారని ఈ సందర్భంగా తెలిపిన మంత్రిత్వ శాఖ.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?