పన్ను పెంపు - భత్యం తొలగింపు కరోనా నేపథ్యంలో సౌదీ చర్యలు
- May 11, 2020
సౌదీ అరేబియా:సంవృద్ధిగా చమురు నిల్వలుండి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్న గల్ఫ్ దేశాలు.. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా కారణంగా ఆర్థిక ఒడుడుగులను ఎదుర్కొంటున్నది. నానాటికి తగ్గుముఖం పడుతున్న చమురు ధరలు ఒకవైపు, దేశ ఆర్థిక పరిస్థితి మరోవైపు వెరసి సౌదీఅరేబియాను ముప్పతిప్పలు పెడుతోంది. దీంతో సౌదీ అరేబియా దిద్దుబాటు చర్యలు చేపట్టయింది.
విలువ ఆధారిత పన్నును (వ్యాట్) ను పెంచింది. జీవన ప్రమాణ భత్యం ని తీసివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సౌదీ ప్రెస్ ఏజెన్సీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. రానున్న జులై 1నుంచి వ్యాట్ ను 5నుంచి 15 శాతం పెంచుతున్నట్లు, జీవన భత్యం జూన్ 1 తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అల్ జదాన్ ప్రకటించారు. అతిత్వరలో క్లిష్టమైన, బాధాకరమైన నిర్ణయాలు ఉంటాయని గతవారం ఆయన అన్నారు. దీనికి అనుగుణంగానే ఈ ప్రకటన వెలువడిందని భావించాలి. బడ్జెట్ ఖర్చులు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు కూడా నెమ్మదించే అవకాశం ఉందని.. ఇది ఖర్చులు తగ్గించే దిశలో ఒక విధానంగా భావిస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. రానున్న కాలంలో మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఒకవైపు ఖర్చులు తగ్గించుకోవడం మరోవైపు ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం చేయడం వంటి రెండు మార్గాలు ఒకటేసారి అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
సౌదీలోనూ పడగవిప్పిన కరోనా
ఆర్ధికంగా అగ్రరాజ్యం అమెరికా లొనే ఈ ఏప్రిల్ నెలలో 20 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.సోమవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కోవిద్ 19 వల్ల 4.18 మిలియన్ మందికి వ్యాధి సోకింది. ఇందులో 2.83 లక్షల మంది మృత్యువాత పడ్డారు. చైనాలోని వ్యూహాన్ లో గత డిసెంబరు లో ఈ వ్యాధి ప్రారంభమయింది. సౌదీఅరేబియాలో ఇప్పటివరకు 39,048 కరోనా సోకగా అందులో 27,345 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 11, 457 మంది బయట పడ్డారు.
సౌదీఅరేబియాలో లో ఇప్పటి వరకు 246 మంది మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు