2 మొబైల్‌ ఆసుపత్రుల్ని నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌

- May 12, 2020 , by Maagulf
2 మొబైల్‌ ఆసుపత్రుల్ని నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ తరఫున జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ మెడికల్‌ సర్వీసెస్‌ - ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ రెండు మొబైల్‌ ఆసుపత్రుల్ని నిర్మించింది. మక్కాలో 100 పడకలతో వీటిని నిర్మించారు. కోవిడ్‌19 బాధితులకు ఈ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. పౌరులు అలాగే వలసదారులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకోసం వీటిని రూపొందించారు. ఈ రెండు మొబైల్‌ హాస్పిటల్స్‌లో అవసరమైన మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ని పొందుపర్చారు. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సంయుక్తంగా వీటిని నిర్వహిస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com