ఆర్థిక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
- May 13, 2020
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. లాక్ డౌన్ తో ఆదాయం పడిపోయింది. సామాన్యులు ఇంకా పేదవారిగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కుప్పకూలుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదే ప్రయత్నాల్లో భాగంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇది భారత జీడీపీలో దాదాపు 10 శాతమని ప్రకటించారు.ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయబోతున్నారని ఊహాగానాలు భారీగా నెలకొన్నాయి. రూ.20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయించేదీ వివరించనున్నారనే అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్యాకేజీని ప్రజలకు అందజేసే అంశాలపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకూరనుందన్న విషయాలపై ప్రకటన చేశారు. జపాన్ తమ జీడీపీలో 21 శాతం, అమెరికా 13 శాతం విలువైన ప్యాకేజీలను ప్రకటించాయి. ఆ తర్వాత అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించిన దేశంగా భారత్ నిలిచింది. వివిధ వర్గాలతో, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపాక ఈ ప్యాకేజ్ ప్రకటించాం. వివిధ పారిశ్రామిక వర్గాలతో మాట్లాడాం. లోకల్ బ్రాండ్ కు ప్రాధాన్యత. స్వయం సమృద్ధికి మోడీ పెద్ద పీట వేశారు. ఎకానమీ, మౌలిక రంగం, టెక్నాలజీ, వనరులపై ఫోకస్.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







