తెలంగాణ:మళ్లీ పెరిగిన కరోనా కేసులు

- May 14, 2020 , by Maagulf
తెలంగాణ:మళ్లీ పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,414 చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 428 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.. ఇక, ఇవాళ 13 మందిని డిశ్చార్జ్ చేయగా.. డిశ్చార్జి అయినవారి సంఖ్య 952కి చేరింది.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది.. ఇవాళ ఒకే రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 కొత్త కేసులు వెలుగు చూడగా.. రంగారెడ్డి జిల్లాలో ఐదు కేసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇద్దరికి.. మొత్తంగా 47 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com