4,300 కుటుంబాలకు Dh5,000 చొప్పున దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ ఆర్ధిక సాయం
- May 16, 2020
యూ.ఏ.ఈ:పవిత్ర రమదాన్ మాసంలో అర్హులైన లబ్ధిదారులకు దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ ఆర్ధిక సాయం అందించింది.రస్ అల్ ఖైమా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 4,300 మంది కుటుంబాలకు సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి Dh1,500 నుంచి Dh5,000 వరకు బ్యాంకులో డిపాజిట్ చేశారు.కుటుంబ సభ్యుల లెక్క ఆధారంగా ఆర్ధిక సాయం విలువను నిర్ధారించినట్లు స్వచ్చంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆర్ధిక సాయం డబ్బులను కొందరికి నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తే..మరికొందరికి ఎక్సేంజ్ హౌజ్ ద్వారా లబ్ధదారులకు అందించారు.అలాగే స్టాఫ్ మెంబర్స్ ద్వారా ఇంకొందరికి ఆర్ధిక సాయం అందజేశారు. ఇదిలాఉంటే..నగదు పంపిణీలో కరోనా వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను పాటించినట్లు స్వచ్చంద సంస్థ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







