తెలంగాణ:మరో 55 కరోనా పాజిటివ్ కేసులు
- May 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మరో 8 కేసులు వలసదారులకు సంబంధించినవని కాగా.. సంగారెడ్డిలో రెండు, రంగారెడ్డి జిల్లాలో ఒక్క కేసు నమోదైనట్లు ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై శనివారం బులెటిన్ విడుదల చేశారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,509కు చేరుకుందని పేర్కొన్నారు. శనివారం 12 మంది కోలుకున్నారు. ఈ 12 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 971 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోగా, ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతున్నారన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







