భారత్ లో 90,000 దాటిన కరోనా కేసులు
- May 17, 2020
భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే వుంది. ఇప్పటికే కేసుల్లో చైనా ను దాటిన భారత్...తాజా కేసులతో 90 వేలు క్రాస్ చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 4,987 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 124 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటి వరకు భారత్లో మొత్తం 90,927 కేసులు నమోదు కాగా, 2,872 కరోనా మరణాలు సంభవించాయి. ఇక 53,946 యాక్టివ్ కేసులు ఉండగా, 34,108 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నేటితో లాక్ డౌన్ 3 ముగుస్తున్న వేళ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ ను సడలిస్తే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు వాతావరణం కూడా చల్లబడింది. దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







