భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు

- May 20, 2020 , by Maagulf
భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు

భారత దేశంలో కరోనా వేవ్ సూపర్ సోనిక్ వేగంతో పరిగెడుతోంది. సోమవారం 5వేల కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు లక్ష దాటగా... మంగళవారం మరో 5611 కేసులు వచ్చి చేరాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 106750కి చేరింది. మరణాలు కూడా అంతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే 140 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 3303కి చేరింది. ఈ నంబర్లు ఎంకా ఎంతదాకా వెళ్తాయో అనే టెన్షన్ దేశ ప్రజల్లో కనిపిస్తోంది. ఓవైపు లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేస్తుంటే... మరోవైపు ఈ పరిస్థితి తలెత్తుతుండటం షాకింగ్ అంశమే.

ఒకప్పుడు భారత్ లో అసలు కరోనాయే లేదనీ, భలే కట్టడి చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా లాంటి దేశాలు మెచ్చుకున్నాయి.

ఇప్పుడు అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను చూసి... భారత్ కూడా అమెరికా, బ్రెజిల్, రష్యా ... సరసన చేరిందని భావిస్తోంది. ప్రస్తుతం కొత్త కేసుల్లో మన దేశం నాలుగో స్థానంలోనే ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 11 వ స్థానంలో ఉంది.

భారత్ లో ఇప్పటివరకూ 42927 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరిలో నిన్న ఒక్క రోజే 324 మంది కోలుకోవడం మంచి విషయం. ఇండియాలో రికవరీ రేటు బాగా ఉంది. అందువల్ల అదో ఉపశమన అంశం అని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఏది ఏమైనా భారత్లో కరోనా మాత్రం ఇప్పట్లో కంట్రోల్ అయ్యేలా కనిపించట్లేదు.ప్రధానంగా మహారాష్ట్ర 37136 కేసులతో టెన్షన్ తెప్పిస్తోంది. అక్కడ నిన్న ఒక్క రోజే 2078 కొత్త కేసులొచ్చాయి. ఇక ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లో కూడా విపరీతంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ అయితే తప్ప... భారత్లో నంబర్లు స్లో అవ్వవనే మాట వినిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com