కమర్షియల్‌ ఫ్లైట్స్‌కి సిద్ధమవుతున్న కువైట్‌ ఎయిర్‌పోర్ట్స్‌

- May 20, 2020 , by Maagulf
కమర్షియల్‌ ఫ్లైట్స్‌కి సిద్ధమవుతున్న కువైట్‌ ఎయిర్‌పోర్ట్స్‌

కువైట్:కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌లైన్‌ ట్రాఫిక్‌ని తిరిగి ప్రారంభించడానికి సర్వసన్నద్ధమవుతోంది. హెల్త్‌ అథారిటీస్‌ సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుని కమర్షియల్‌ ఆపరేషన్స్‌ నిర్వహించనుంది కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఈ మేరకు ఆయా డిపార్ట్‌మెంట్స్‌కి ‘సన్నద్ధత’పై సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నెమ్మదిగా కార్యకలాపాల్ని ప్రారంభించి క్రమక్రమంగా వాటిని విస్తరించాలని కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం భావిస్తోంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com