ఈద్‌ అల్‌ ఫితర్‌: శుక్రవారం సమావేశం కానున్న యూఏఈ మూన్‌ సైటింగ్‌ కమిటీ

- May 20, 2020 , by Maagulf
ఈద్‌ అల్‌ ఫితర్‌: శుక్రవారం సమావేశం కానున్న యూఏఈ మూన్‌ సైటింగ్‌ కమిటీ

యూ.ఏ.ఈ:షవ్వాల్‌ క్రిసెంట్‌ సైట్‌ కోసం యూఏఈలో ఏర్పాటైన మూన్‌ సైటింగ్‌ కమిటీ, శుక్రవారం సమావేశం కానుంది. మినిస్టర్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఈ కమిటీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, మే 22, రమదాన్‌ 29 మఘ్రిబ్‌ ప్రార్థనల అనంతరం క్రిసెంట్‌ని గుర్తించేందుకోసం కమిటీ సమావేశం జరుగుతుంది. క్రిసెంట్‌ గనుక దర్శనమిస్తే, ఆ మరుసటి రోజు షవ్వాల్‌ తొలి రోజు అవుతుంది. అదే రోజున ఈద్‌ అల్‌ ఫితర్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. దేశంలో అన్ని షరియా కోర్టులు, మూన్‌ సైటింగ్‌ని గుర్తించి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com