50 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య
- May 21, 2020
దాదాపు 5 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ బారినపడ్డవారి సంఖ్య అక్షరాలా 50 లక్షలు దాటింది. చైనాలో గత ఏడాది వెలుగు చూసిన కరోనా వైరస్… భూమండలాన్ని చుట్టుముట్టి తన గుప్పిట్లో బంధించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఏరోజుకారోజు… కేసుల ఉధృతి పెరుగతూనే పోతోంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో బీభత్సం సృష్టించిన వైరస్…. ఆ తర్వాతి కాలంలో యూరప్‌ను అతలాకుతలం చేసింది. అక్కడ కేసుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా.. అగ్ర రాజ్యాన్ని పూర్తిస్థాయిలో కుదిపేసింది. ఒక్క అమెరికాలోనే.. 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్లు విధించడం వల్ల.. ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలడంతో… దేశాలన్నీ చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి 3 లక్షల 26 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. వీటిలో దాదాపు లక్ష మరణాలు.. ఒక్క అమెరికాలోనే సంభవించడం… అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూరప్, అమెరికాల్లో ఒక రేంజ్లో మృత్యు క్రీడ సాగించిన కరోనా… క్రమంగా రష్యా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తోంది. రష్యా, బ్రెజిల్ దేశాల్లో ప్రతీ రోజు యావరేజ్‌గా… 10 వేల కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్లో తాజాగా… దాదాపు 12 మంది కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ఆదేశంలో మహమ్మారి ప్రబలాక.. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అటు బ్రెజిల్లో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేలు దాటింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు