యూఏఈ:వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసిన విద్యాశాఖ
- May 21, 2020
యూఏఈలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వేసవి సెలవులను ఖరారు చేసింది విద్యా మంత్రిత్వ శాఖ. ముందస్తుగా ప్రకటించినట్లుగానే జులై 2 నుంచి విద్యాశాఖ సిలబస్ పాటించే అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన అంతరాయం కారణంగా వేసవి సెలవులను మార్చబోవటం లేదని కూడా స్పష్టం చేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. విద్యార్ధులకు జులై 2 నుంచి సెలవులు ప్రారంభం అయితే..స్కూల్ స్టాఫ్ కు మాత్రం వారం ఆలస్యంగా జులై 9 నుంచి సెలవులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పుడే ఏ నిర్ణయమూ చెప్పలేమని కూడా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై సెప్టెంబర్ లో ఆనాటి పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ నాటికి దేశంలో కరోనా తీవ్రతను బట్టి స్కూళ్లను ప్రారంభించాలా? వర్చువల్ స్టడీస్ కొనసాగించాలా? అనేది నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







