అబుధాబి:'ఉచిత టిక్కెట్ల' వార్త పై స్పందించిన ISC సెక్రటరీ

- May 22, 2020 , by Maagulf
అబుధాబి:\'ఉచిత టిక్కెట్ల\' వార్త పై స్పందించిన ISC సెక్రటరీ

మిత్రులారా ఈ రోజు ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫార్వర్డ్ చేసిన వాయిస్ రికార్డ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా వినడం జరిగింది. అందులో నా పేరు ను ఉచ్చరిస్తూ నేను ISC మరియు Indian Embassy సహకారం తో ఇక్కడి నుండి వెళ్ళే కార్మికులకు ఉచిత టిక్కెట్లు ఇప్పిస్తున్నానని తప్పుడు ప్రచారం చేసారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు మరియు వారి ప్రకటన ఆంతర్యం తో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇండియా సోషల్ సెంటర్ లో ఒక బాధ్యాతయుతమైన స్థానము లో ఉన్నాను. ఇండియా సోషల్ సెంటర్ ని కానీ, నన్ను కానీ అభాసు పాలు చెయ్యడం ఎంత మాత్రం సబబు కాదని ఆ వాయిస్ రికార్డ్ ఫార్వర్డ్ చేస్తున్న వారికి చెప్పగలరు. ఏ మెసేజ్ నయినా ఫార్వర్డ్ చేసేముందు దాని నిజ నిర్ధారణ చేసుకోవాల్సింది గా మరొక్క సారి అందరికి విన్నపం. నాకు గాని అందులో పేర్కొన్న సంస్థల కు గాని ఆ వాయిస్ రికార్డ్ కు ఎటువంటి సంబంధం లేదని మరొక్కసారి ఘంటాపథంగా చెవుతున్నాను.

--ఇట్లు మీ రాజా శ్రీనివాస రావు ఐత(ISC సెక్రటరీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com