గల్ఫ్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు 97 ఫ్లైట్స్ నడపనున్న ఇండిగో
- May 22, 2020
లాక్ డౌన్ తో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే వందే భారత్ మిషన్ లో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా భాగస్వామ్యం అవుతోంది. గల్ఫ్ దేశాల్లోని నాలుగు దేశాల నుంచి ఇండియాకు మొత్తం 97 విమాన సర్వీసులను నడపనున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ఇందులో 23 సర్వీసులను కువైట్ నుంచి కేరళకు నడపనుంది. అలాగే దోహా నుంచి 28, మస్కట్ నుంచి 10, సౌదీ నుంచి 36 విమాన సర్వీసులను కేరళకు నడపనుంది. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణను అన్ని జాగ్రత్తలు పాటిస్తామని ఇండిగో వెల్లడించింది. ఇదిలాఉంటే వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే విమాన సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై భారత విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ..వందే భారత్ మిషన్ లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు త్వరలోనే ఆయా విమానయాన సంస్థలకు కూడా అనుమతి ఇస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







