రమదాన్ సందర్భంగా ప్రవాస కార్మికులకు 4 లక్షల ఆహార పొట్లాల పంపిణీ
- May 22, 2020
మనామా:బహ్రెయిన్ రాజధాని మనామాలో ప్రవాస కార్మికులకు ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా చేపట్టిన ఫీనా ఖైర్ లో భాగంగా దాదాపు 4 లక్షల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనామా గవర్నర్ షేక్ హిషమ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో భాగంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తము ప్రవాస కార్మికులకు ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ దేశం మానవతా దృక్పధం చాటుతోందన్నారు. బహ్రెయిన్ సమాజంలో భాగమైన విలువలకు ఫీనా ఖైర్ ఓ సంకేతమన్నారు. కష్టాల్లో ఉన్నవారికి తాము సంఘీభావంగా నిలబడతామన్నారు. మరోవైపు కష్టాల్లో ఉన్న వారి ఆకలి బాధ తీర్చేందుకు ఫీనా ఖైర్ చేపట్టాలని ఆదేశించిన జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫాపై గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజధాని ప్రాంతంలో ప్రతి రోజు ఆహార పొట్లాలను అందించేలా స్వసంచ సంస్థలు, వాలంటీర్లు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







