RBI మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు..

- May 22, 2020 , by Maagulf
RBI మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు..

న్యూఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఐ, క్రెడిట్ కార్డు చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుభవార్త చెప్పారు. రుణాలపై మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతో జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మారటోరియం సదుపాయం ఉంటుంది. కాగా గతంలో మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు 3 నెలల పాటు మారటోరియం ప్రకటించగా.. దాన్నిప్పుడు మరో 3 నెలలు పొడిగించారు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికీ అనేక మంది ఉద్యోగాలకు వెళ్లకపోవడం, అనేక మంది ఉపాధిని కోల్పోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. అందుకనే మారటోరియాన్ని మరో 3 నెలలు పొడిగించారు.

కాగా మీడియా సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి బాగా తగ్గిందన్నారు. కరోనా ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందన్నారు. ఈ క్రమంలోనే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో ఆ రేటు ప్రస్తుతం ఉన్న 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. అలాగే రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.

ఇక మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని శక్తికాంతదాస్ తెలిపారు. అలాగే ఆర్థిక రంగం అభివృద్ధికి మరిన్ని ఉద్దీపన చర్యలు చేపడతామన్నారు. అయితే ఆయన ఈ వివరాలను వెల్లడించగానే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయింది. బ్యాంకుల షేర్లు కుప్పకూలాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com