ఎమిరేట్స్ ఫ్లైట్స్ కోసం దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సన్నాహాలు
- May 22, 2020
దుబాయ్: దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, తిరిగి విమాన సర్వీసుల్ని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సేవల్ని ప్రారంభించేందుకు సర్వసన్నద్ధంగా వుందని తెలిపింది. టెర్మినల్ 3 నుంచి ఆపరేషన్స్ నిర్వహించనున్నామనీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వంటివి ప్రయాణాలకు తప్పనిసరి చేస్తున్నామనీ, ఎయిర్‌పోర్ట్‌కి నాలుగు గంటల ముందుగా ప్రయాణీకులు రావాల్సి వుంటుందనీ, నాలుగు గంటల కంటే ఎక్కువ ముందుగా వచ్చేవారిని అనుమతించబోమని అధికారులు చెప్పారు. పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్స్ లేనివారు, కన్ఫర్మ్డ్ టిక్కెట్స్ లేనివారిని అనుమతించే అవకాశమే లేదని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ స్పష్టం చేసింది. కర్ఫ్యూ సమయాల్ని ప్రయాణీకులు పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. థర్మల్ మరియు టెంపరచేర్ స్క్రీనింగ్, సోషల్ డిస్టెన్సింగ్ మార్క్స్.. ఇలా పలు ఏర్పాట్లను చేశారు. ఎప్పటికప్పుడు శానిటేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ కాంకోర్స్‌లో ఎంపిక చేసిన కేఫ్‌లు, రెస్టారెంట్లు కూడా తెరిచి వుంటాయి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







