ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూత
- May 23, 2020
తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలో ప్రజలను అలరించిన ప్రముఖ మికిక్రీ కళాకారుడు, సినీనటుడు హరికిషన్(57) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. వందమందికిపై గొంతుకలను అనుకరించే ఆయన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.
హరికిషన్ స్వస్థలం ఏపీలోని ఏలూరు. బాల్యంలోనే మిమిక్రీపై ఆసక్త పెంచుకున్న ఆయన మిమిక్రీ దిగ్గజం నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో ధ్వన్యనుకరణపై పట్టుసాధించారు. ఎన్టీఆర్ , అక్కినేని, చిరంజీవి ల గొంతుకలను బాగా అనుకరించేవారు. వైఎస్ఆర్ , కేసీఆర్ , వీహెచ్ వంటి రాజకీయ నాయకుల గొంతులు కూడా ఆయనకు కొట్టినపిండే. కొన్నాళ్లు స్కూల్లో టీచర్ గా పనిచేసి హరికిషన్ ఆ జీవితం నచ్చక పూర్తి స్థాయి మిమిక్రీ కళాకారుడిగా మారారు.సినిమాల్లో చిన్నచిన్న వేషాలు కూడా వేశారు. టీవీ చానళ్లలో లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







