మస్కట్:కోవిడ్‌ 19 అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు..

- May 24, 2020 , by Maagulf
మస్కట్:కోవిడ్‌ 19 అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు..

మస్కట్:కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా సుప్రీం కమిటీ సూచించిన పలు నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేసేలా రాయల్‌ ఒమన్‌ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పోలీసులు ఒమన్‌ పోలీసులు తమకు అనుమానం ఉన్న ప్రతి చోటును తనిఖీ చేసే ఆధికారాన్ని సుప్రీం కమిటీ అప్పగించింది. దీంతో ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యక్తిగత ఇళ్లలోనూ తనిఖీలు చేయవచ్చు. ఎవరైనా సరే సుప్రీం కమిటీ నిబంధనలు పాటించకుండా కనిపిస్తే వెంటనే జరిమానాలు విధించాలని, న్యాయవిచారణకు తరలించాలని కూడా సుప్రీం కమిటీ రాయల్‌ ఓమన్‌ పోలీసులను ఆదేశించింది. దీనికి సంబంధించి ఆర్టికల్ 2లోని 151/2020 తీర్మానంలో పాటించాల్సిన నిబంధనలను సూచించనున్నారు. ఈ తీర్మానం ప్రచురితమైన వెంటనే ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
కొత్త తీర్మానంలోని ప్రధాన అంశాలు..
1. రాయల్ ఒమన్ పోలీసులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తనిఖీలు చేపట్టవచ్చు. వ్యక్తుల ఇళ్లలోకి కూడా వెళ్లి తనిఖీలు చేయవచ్చు.
2. సుప్రీం కమిటీ నిబంధనలకు విరుద్ధంగా ట్రాకింగ్ బ్రేస్లెట్ తీసేసినా, దాన్ని పాడు చేసినా 300 ఒమని రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు. మళ్లీ అదే తప్పును పునరావృతం చేస్తే ఫైన్‌ రెట్టింపు చేస్తారు.
3. సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలకు విరుద్ధంగా పర్యాకట కేంద్రాలను తెరువకూడదు. క్లబ్స్‌, స్టోర్స్‌, స్పోర్ట్స్‌ క్లబ్స్‌ తో పాటు బార్బర్‌ షాపులను కూడా మూసి ఉంచాల్సిందే. అలా కాదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 3000 ఒమన్‌ రియాల్స్‌ జరిమానా విధిస్తారు.
4. రమదాన్  సందర్భంగా ప్రజలు సమూహంగా కనిపించకూడదు. ఒక్క కుటుంబం కంటే ఎక్కవ మంది ఉండకూడదు. ఒక్క కుటుంబంలో కూడా ఒకే చోట ఐదుగురికి మించి ఉండకూడదు.  అలాగే అంత్యక్రియల్లోనూ జనం పెద్ద సంఖ్యలో పాల్గొనకూడదు. కరోనా కట్టడికి సుప్రీం కమిటీ సూచించిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 100 ఒమన్‌ రియాల్స్‌ జరిమానా విధించాలని రాయల్‌ ఒమన్‌ పోలీసులకు సూచించింది. మళ్లీ అదే తప్పు చేస్తే జరిమానా రెట్టింపు చేస్తారు.
5. కోవిడ్‌ 19 కట్టిడికి సుప్రీం కమిటీ విధించిన నిబంధనలను మాటి మాటికి ఉల్లంఘిస్తే జరిమానాలను రెట్టింపు చేయటంతో పాటు అవసరమైతే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com