యూ.ఏ.ఈ:10 శాతం మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నమోదు
- May 24, 2020
దుబాయ్:కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాల నుంచి భారత్ కు తిరిగొస్తున్న ప్రవాసీయుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. యూఏఈ నుంచి ముందుగా అంచనా వేసిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో ప్రవాస భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మంగళవారం నుంచి మూడో దశ స్వదేశానికి తిరిగి రప్పించే ప్రక్రియలో భారత్ మరిన్ని విమానాలను చేర్చనుంది.యూఏలోని మొత్తం ప్రవాసీయుల్లో దాదాపు 10 శాతం మంది భారత్ చేపట్టిన వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ వెల్లడించారు. ప్రయాణికుల సంఖ్య పెరగటంతో మూడో దశలో తరలింపు సమయంలో విమానాల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం యూఏఈలో 3.5 మిలియన్ల ప్రవాసభారతీయులు ఉంటే..స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే..ఇందులో కొద్ది మంది వివిధ కారణాలతో రెండో ఆలోచనలో ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. తాము దాదాపు 500 మందికి ప్రయాణ ఏర్పాట్లు చేస్తే..చివరి నిమిషంలో కొద్దిమంది ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. కొందరు ప్రయాణఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. మరికొందరు పెయిడ్ క్వారంటైన్ కు ఇష్టపడటం లేదు. అందుకే ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఏదిఏమైనా యూఏఈ నుంచి ఇప్పటివరకు 6000 మందిని స్వదేశానికి తరలించినట్లు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







